మన రాష్ట్రంలో 2025 ఆగస్టు 27వ తేదీ నుండి జరగబోయే గణపతి నవరాత్రులకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున వివిధ విభాగాల సహకారంతో ఎటువంటి ఇబ్బందులు రాకుండా ఉత్సవముల నిర్వహణ కొరకు తగు ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆంధ్రప్రదేశ్ గణేష్ ఉత్సవ సమితి కోరుతున్నది.
వినాయక చవితి సందర్భంగా రాష్ట్రంలోని మారుమూల పల్లెల నుండి పట్టణాల వరకు భక్తిశ్రద్ధలతో తమ కష్టాలు తొలగి, వినాయకుని అనుగ్రహం అందరికీ కలగాలని కోరుకుంటూ గణపతి మండపాలు ఏర్పాటు చేసుకొని నవరాత్రులు జరుపుకోవడం వేల సంవత్సరాలుగా ఆనవాయితీగా వస్తున్నది. ఈ ఉత్సవాల నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం సంబందిత శాఖల ద్వార ఎటువంటి ఇబ్బందులు కలగకుండా సింగిల్ విండో పద్ధతిలో మండపాలకి సహకారం అందించాలని ఆంధ్రప్రదేశ్ గణేష్ ఉత్సవ సమితి కోరుతున్నది.
గణపతి నవరాత్రుల కోసం మండపాలు ఏర్పాటు చేసుకునేవారికి స్థానిక పరిపాలన వ్యవస్థల ద్వార పారిశుద్ధ్యము, వైద్యము, విద్యుత్, సౌండ్ సిస్టం మరియు నిమజ్జన యాత్ర కోసం రూట్ క్లియరెన్స్, భద్రత, నిమజ్జన ప్రాంగణంలో వేదిక మరియు క్రేన్లు తదితర వసతుల ఏర్పాట్లు చేయాలని ఆంధ్రప్రదేశ్ గణేష్ ఉత్సవ సమితి రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నది.
గణేష్ విగ్రహాల ఎత్తుపై ఆంక్షలు మరియు అనుమతుల పేరుతో రకరకాల రుసుములు వసూలు చేయడం, పర్యావరణ కాలుష్యం పేరుతో నియంత్రణలు పెట్టడం, NOC తీసుకోవాలని కోరడంలాంటి ఇబ్బందులు పెట్టకుండా తగుసూచనలు స్థానిక అధికారులకు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాము. గణేష్ నవరాత్రులని హిందువులు ఆనందోత్సవాలతో వైభవంగా జరుపుకొనుటకు తగు సహకారం అందించాలని రాష్ట్ర ప్రభుత్వ్వాన్ని ఆంధ్రప్రదేశ్ గణేష్ ఉత్సవ సమితి కోరుతున్నది.
ప్రధాన కార్యదర్శి , అధ్యక్షులు,
మన రాష్ట్రంలో 2025 ఆగస్టు 27వ తేదీ నుండి జరగబోయే గణపతి నవరాత్రులకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున వివిధ విభాగాల సహకారంతో ఎటువంటి ఇబ్బందులు రాకుండా ఉత్సవముల నిర్వహణ కొరకు తగు ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆంధ్రప్రదేశ్ గణేష్ ఉత్సవ సమితి కోరుతున్నది.